సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫుల్ బాటిల్’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘డార్క్ కామెడీ కథాంశమిది. సత్యదేవ్ పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. ఎక్కువ భాగం కాకినాడలో షూటింగ్ జరిపాం’ అన్నారు. ‘నాలుగు క్వార్టర్స్ కలిస్తే ఫుల్‌బాటిల్. అలాగే మనిషి జీవితం కూడా ఫుల్‌బాటిల్ లాంటిదని ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టాం. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నాలోని ఆ కోణాన్ని చూపించే చిత్రమిది. ఇందులో నేను మోర్క్యురీ సూరి అనే పాత్రలో కనిపిస్తాను’ అని హీరో సత్యదేవ్ తెలిపారు. నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ ‘సత్యదేవ్ ప్రతీ సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ఈ సినిమా నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, సాయిరాజేష్, రాహుల్ సంక్రిత్యాన్, చందు మొండేటి తదితరులు పాల్గొన్నారు.