Vijay Devarakonda Clarifies About Sukumar movie | ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇండియా టూర్ పేరుతో ప్రతి రాష్ట్రంలో మెయిన్ సిటీలో ప్రెస్మీట్లను నిర్వహించి సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో లైగర్ బృందం తీరిక లేకుండా ప్రమోషన్లను జరుపుతుంది. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ సినిమాపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ, సుకుమార్‌తో చేయబోయే సినిమాపై స్పందించాడు.
సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా చేస్తున్నాడని గతంలోనే ప్రకటన వచ్చింది. ఫాల్కన్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనునట్లు 2020లోనే ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో సినిమా ఆగిపోయింది అని అనుకున్నారు. కాగా తాజాగా దీనిపై విజయ్ స్పందించాడు. సుకుమార్‌తో సినిమా వాస్తవమేనని, కానీ దానికి కాస్త సమయం పడుతుందని తెలిపాడు. అంతేకాకుండా సుకమార్ ప్రస్తుతం పుష్ఫ-2తో బిజీగా ఉన్నాడని, ఈ చిత్రం పూర్తి కాగానే తమ సినిమా పట్టాలెక్కనుందని వెల్లడించాడు. దాంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
లైగర్ చిత్రంతో విజయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విజయ్‌పై నార్త్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా విజయ్ క్రేజ్ పెరుగుందని నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైలోని ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సర్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.