Vijay Antony’s ‘Bhadrakali’ | తమిళ నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా వస్తున్న 25వ సినిమా ‘భద్రకాళి’. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ‘శక్తి తిరుమగన్’ పేరుతో విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో రాబోతుంది. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. రూ. 190కోట్ల కుంభకోణం చుట్టూ నడిచే కథ ఇదని, యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని, విజయ్ ఆంటోని పాత్ర డిఫరెంట్ షేడ్స్‌తో సాగుతుందని మేకర్స్ తెలిపారు.