Bichagadu 3 | తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మార్గన్’ (Maargan). క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మిస్తుంది. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్ విడుదల చేయబోతుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ముచ్చాటించాడు విజయ్. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని విజయ్ తెలిపాడు. బిచ్చగాడు సినిమా హిట్ అయినట్లుగానే మార్గన్ సినిమా కూడా తెలుగులో మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు విజయ్.
అయితే ఈ మీట్లో మీడియా అడుగుతూ.. మీ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు వస్తుందని అడుగగా.. విజయ్ సమాధానమిస్తూ.. ప్రస్తుతం నేను బిచ్చగాడు 3 సినిమాను తెరకెక్కిస్తున్నాను. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫస్ట్ రెండు పార్టుల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని విజయ్ చెప్పుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక సైకో స్విమ్మర్ అమ్మాయిలకు ఒక వింత డ్రగ్‌ను ఇచ్చి హత్య చేస్తుంటాడు. ఈ డ్రగ్ ప్రభావం వల్ల వారి భాదితుల శరీరాలు నల్లగా మారి ప్రాణాలు కోల్పోతాయి. అయితే ఈ కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. దర్యాప్తులో భాగంగా అతను కూడా ఈ డ్రగ్ బారిన పడి, అతని శరీరంలో సగం నల్లగా మారడం ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, హంతకుడిని విజయ్ ఆంటోనీ ఎలా పట్టుకుంటాడనేది సినిమా ప్రధాన కథాంశం. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ విలన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.