విజయ్ ఆంటోని నటిస్తున్న పొయెటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకుడు. కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. ఆగస్ట్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. తనను చిన్నచూపు చూసే సమాజం భవితను మార్చిన ఓవ్యక్తి కథ ఇదని, ఓ దీవి నేపథ్యంలో సాగే ఈ సినిమాను అండమాన్, డయ్యూడమన్‌లలో చిత్రీకరించామని, ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నందుకు ఆనందంగా ఉందని, సినిమా కూడా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని మేకర్స్ తెలిపారు.
మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మురళీశర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తైవాసల్ తదితరులు ఇతర పాత్రధారులు. అచ్చుమణితో కలిసి విజయ్ ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్రానికి నిర్మాణం: ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్.