ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ వీఆర్ఎల్ గ్రూప్ అధినేత డాక్టర్ ఆనంద్ శంకేశ్వర్ జీవిత కథతో వస్తున్న సినిమా ‘విజయానంద్’. నీహాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వీఆర్ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక సాధారణ వ్యక్తి వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగాడు అనేది ఈ టీజర్లో చూపించారు. స్ఫూర్తి కలిగించేలా కథానాయకుడి ప్రయాణం సాగింది. అనంత్ నాగ్, వినయప్రసాద్, వి రవిచంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కీర్తన్, సంగీతం : గోపీ సుందర్.