అగ్ర కథానాయిక నయనతార మంగళవారం జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్‌శివన్ నయనతారకు పదికోట్ల విలువైన రోల్స్ రాయిస్ స్పెక్ట్రా బ్లాక్ బ్యాడ్జ్ కారును బహుమతిగా అందిచాడు.
భారత్‌లో ఈ కారు ఖరీదు చేసిన తొలి సినిమా తార నయనతార కావడం విశేషం. కుటుంబ సభ్యులతో కలిసి కొత్తకారు ముందు తీయించుకున్న ఫొటోలను నయనతార సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.