ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఆ చిత్రాల్లో ఆమె ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై విద్యాబాలన్ కనిపించలేదు. అయితే.. మళ్లీ ఆమె టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నారనేది లేటెస్ట్ న్యూస్. అది కూడా బాలయ్య సినిమాతోనేనట. ప్రస్తుతం బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ – తాండవం’ షూటింగ్లో బాలయ్య బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారట. ఇందులో కథ రీత్యా ఓ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్ర ఉందట. ఆ పాత్రకోసం విద్యాబాలన్‌ని బోయపాటి సంప్రదించారనీ, కథ, పాత్ర విన్న తర్వాత ఆమె చేయడానికి అంగీకరించారని సమాచారం. స్టార్హీరోయిన్ విద్యాబాలన్‌తో ఆ పాత్ర చేయిస్తున్నారంటే.. కచితంగా కథలో కీలకమైన పాత్రే అయ్యుంటుదని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పుడు విద్యాబాలన్ కూడా తోడవ్వడంతో.. ‘అఖండ-తాండవం’ చిత్రానికి బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఏర్పడటం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.