ఆస్కార్ అకాడమీలో సభ్యులుగా విద్యాబాలన్, ఏక్తా కపూర్

న్యూఢిల్లీ: ఆస్కార్ అకాడమీలోకి కొత్త సభ్యులు వచ్చేశారు. ఆ లిస్టులో మన భారతీయ నటీనటులు కూడా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల వివరాలను వెల్లడించింది. బాలీవుడ్ నటి విద్యా బాలన్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభా కపూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మొత్తం 50 దేశాలకు చెందిన 395 మంది సభ్యులతో జాబితాను ఆస్కార్ అకాడమీ రిలీజ్ చేసింది.
ద క్లాస్ ఆఫ్ 2021 పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మహిళలు ఉన్నారు. మిస్టరీ థ్రిల్లర్ కహానీ, ఫ్యామిలీ డ్రామా తుమ్‌హరి సులు లాంటి చిత్రాల్లో విద్యాబాలన్ నటించి ప్రశంసలు పొందారు. పా, బూల్‌బులయ్యా, పరిణీత, బాబీ జాసూస్, శకుంతలా దేవి లాంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. 2011లో వచ్చిన ద డర్టీ పిక్చర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూసర్లు ఏక్తా కపూర్, శోభా కపూర్లు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులయ్యారు. డ్రీమ్ గర్ల్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలకు వీళ్లు నిర్మాతలుగా చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

