Viduthalai Part 2 | తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathy), మంజు వారియర్(Manju Warriar) జంటగా నటించిన తాజా చిత్రం విడుదల పార్ట్ 2(Viduthalai part 2). ఈ సినిమాకు వెట్రి మారన్(Vetri Maaran) దర్శకత్వం వహించగా.. కమెడియన్ సూరి(Soori) కీలక పాత్రలో నటించాడు. ‘విడుదల’(Viduthala Sequel) చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ హిట్టు అవ్వడంతో భారీ అంచనాలతో పోయిన ప్రేక్షకులకు ఈ చిత్రం నిరాశ పరిచింది. అయితే రిలీజై నెల కూడా కాకుండానే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం (Viduthalai Part 2 OTT) జనవరి 19 నుంచి తెలుగుతో పాటు తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి) ఇచ్చిన క్లూతో ప్రజదళం నాయకుడు పెరుమాళ్ అలియాస్ మాస్టార్ (విజయ్ సేతుపతి)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో పార్ట్ 1 కథం ముగుస్తుంది. అయితే అక్కడినుంచే పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పుకునే పెరుమాళ్ జమీందారి వ్యవస్థకు ఎందుకు అడ్డం తిరిగాడు. ఈ క్రమంలోనే అతడు నాయకుడిగా ఎలా మారాడు. అతడి జీవితంలోకి మహాలక్ష్మి (మంజు వారియర్) ఎలా వచ్చింది. తనను పట్టించిన కానిస్టేబుల్ కుమరేశన్ చివరకు ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.