VidaaMuyarchi – Pattudala | తమిళ అగ్ర నటుడు అజిత్ ప్రస్తుతం కార్ రేసింగ్ పోటీల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచి సత్తాచాటింది అజిత్ రేసింగ్ జట్టు. దీంతో నటుడిగానే కాకుండా రేసర్‌గా రాణించిన అజిత్‌పై ప్రశంసలు కురిపించారు ప్రముఖులు.
ఇదిలావుంటే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తున్న ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగులో పట్టుదల (Pattudala) పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ని నేడు 6.40 నిమిషాలకి జెమిని టీవీ వేదికగా లాంఛ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎంత వాడు గాని (Yennai Arindhal) తర్వాత అజిత్- త్రిష కాంబినేషన్లో ఈ సినిమా రానుండటంతో మూవీ భారీ అంచనాలు ఉన్నాయి.
#VidaaMuyarchi is “Pattudala” in Telugu.
Trailer from 6:40 PM today in Gemini TV YouTube Channel! pic.twitter.com/tmTypRTStz
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 16, 2025