Mahavatar | ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పౌరాణిక, చారిత్రక చిత్రాల నిర్మాణం ఇటీవలకాలంలో ఊపందుకుంది. ముఖ్యంగా భారతీయ పురాణేతిహాసాలను వెండితెర దృశ్యమానం చేయడానికి దర్శకనిర్మాతలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ కోవలోనే హిందీలో.. పరశురాముడి ఇతివృత్తంతో ‘మహావతార్’ చిత్రం రాబోతున్నది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మించబోతున్నారు. అమర్‌కౌశిక్ దర్శకత్వం వహిస్తారు.
బుధవారం పరశురాముడిగా విక్కీకౌశల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అబ్బురపరిచే విజువల్స్, రోమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఇంటెన్స్ యాక్షన్, డ్రామాతో వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని విక్కీ కౌశల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు. 2026 క్రిస్టమస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. పరశురాముడిగా విక్కీకౌశల్ పవర్ఫుల్ లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.