బాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో విక్కీ కౌశల్. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విక్కీ కౌశల్ ప్రస్తుతం ‘సర్దార్ ఉద్దం’అనే చిత్రం చేస్తున్నారు . సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రంకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా విడుదలైంది. ఇందులో విక్కీ కౌశల్ మొహంపై గాట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా పాత్ర కోసం అలా మేకప్ చేయడం సహజం. కాని అవి నిజం గాట్లు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు విక్కీ కౌశల్.
‘2019లో ‘ది బూత్ హంటెడ్ షిప్’ అనే సినిమా చేశాను. అందులో భాగంగా తీసిన ఓ సీన్లో అనుకోకుండా ఓ డోర్ ఫేస్‌పై పడింది. దీంతో గాయమై 13 కుట్లు పడ్డాయి. అలా తన ముఖంపై గాట్లు ఏర్పడ్డాయి అని విక్కీ కౌశల్ అన్నాడు. . కాగా 1919లో జలియన్ వాలాబాగ్‌లో జరిగిన కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కొల్పోయారు. దానికి ప్రతీకారంగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దం సింగ్ కాల్పులకు కారణమైన మైకేల్ ఓ డయ్యర్ ని హత్య చేశాడు. ఆయన జీవిత ఆధారంగానే ‘సర్దార్ ఉద్దం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. షాన్ స్కాట్, స్టీఫెన్ హొగన్, బనితా సంధు, కిర్సీ అవెర్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.