Javed Akhtar | రెండు పెళ్లిళ్లపై తొలిసారి నోరు విప్పిన.. బాలీవుడ్ రైటర్
రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తొలిసారిగా స్పందించాడు. తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు మహిళల గురించి మొదటి సారి నోరువిప్పాడు.
Javed Akhtar | రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై బాలీవుడ్ ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ తొలిసారిగా స్పందించాడు. తన జీవితంలోకి వచ్చిన ఇద్దరు మహిళల గురించి మొదటి సారి నోరువిప్పాడు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఇన్విన్సిబుల్స్ షోకి హాజరైన జావెద్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలు పంచుకున్నాడు.
అర్బాజ్ ఖాన్ హోస్ట్‌గా ది ఇన్విన్సిబుల్స్ టాక్ షో తాజాగా ప్రారంభమైంది. ఆరు భాగాలుగా ఈ టాక్ షోను ప్లాన్ చేశారు. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్‌కు సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ గెస్ట్‌గా రాగా.. రెండో ఎపిసోడ్‌కు బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరు భార్యలతో మ్యారేజి లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని అర్బాజ్ అడగ్గా.. జావెద్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తన భార్య షబానా అజ్మీతో పాటు మాజీ భార్య హనీ ఇరానీలతో తన వివాహ బంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘ నా లైఫ్‌లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరితో నా రిలేషన్ చాలా బాగుంది. రెండో వివాహం వల్ల కానీ.. డివోర్స్ వల్ల కానీ నా బంధం చెడిపోవాల్సింది కానీ అలా అవ్వలేదు’. అని తెలిపాడు. కొన్ని విషయాలు అవతలి వాళ్లకు నచ్చకపోయినా మనం వాళ్లతో కలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి.. ఎందుకంటే వాళ్లు కూడా మన విషయంలో నచ్చని వాటితో సర్దుకుపోతుంటారని ఈ సందర్భంగా జావెద్ తెలిపాడు. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
హనీ ఇరానీతో జావెద్ అక్తర్‌కు 1972లో వివాహం జరిగింది. దాదాపు 13 ఏళ్ల కాపురం తర్వాత మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్. వీరిలో ఫర్హాన్ బాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతుండగా.. జోయా డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

