కన్నడ కళాతపస్వి, సీనియర్ నటుడు రాజేశ్ కన్నుమూత
Rajesh | సీనియర్ నటుడు, కన్నడ కళాతపస్వి రాజేశ్ (Rajesh) కన్నుమూశారు. 89 ఏండ్ల రాజేశ్ గతకొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈనెల ఫిబ్రవరి 9 నుంచి
బెంగళూరు: సీనియర్ నటుడు, కన్నడ కళాతపస్వి రాజేశ్ (Rajesh) కన్నుమూశారు. 89 ఏండ్ల రాజేశ్ గతకొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈనెల ఫిబ్రవరి 9 నుంచి బెంగళూరులోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1960లలో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అనేక అవార్డులు గెలుచుకున్నారు.
రాజేశ్.. 1932, ఏప్రిల్ 15న బెంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ముని చౌడప్ప. అయితే తన చిన్ననాటి నుంచే నటిస్తున్న ఆయన విద్యాసాగర్గా గుర్తింపుపొందారు. 1960లో కన్నడ సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన తన పేరును రాజేశ్గా మార్చుకున్నారు. వందలాది సినిమాల్లో నటించిన ఆయన కళాతపస్విగా పేరొందారు. ఆయనకు కుమార్తె ఆశా రాణి ఉన్నారు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

