ముంబై : అలనాటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర ఇవాళ కోవిడ్ బూస్టర్ టీకా తీసుకున్నారు. ప్రికాషన్ డోసు తీసుకుంటున్న వీడియోను ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. స్నేహితులకు ఆయన ఓ విజ్ఞప్తి చేశారు. అందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కోరారు. ధర్మేంద్ర వయసు 86 ఏళ్లు. అయితే ఇంటి వద్దే ఆ హీరోకు బూస్టర్ డోసు ఇచ్చారు. బూస్టర్ డోసు తీసుకుంటున్నానని, వ్యాక్సిన్ ఇస్తుంటే ఎటువంటి నొప్పి లేదని ధర్మేంద్ర ఆ వీడియోలో తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు, డాక్టర్లను ధర్మేంద్ర దీవించారు.