Chand Basha | ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్ బాషా(92) మరణించాడు. ఆయన ప్రముఖ రచయిత చంద్రబోస్ భార్య, సుచిత్రకు తండ్రి. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీతం అందించాడు.
Chand Basha Passes Away | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు చాంద్ బాషా(92) మరణించాడు. ఆయన ప్రముఖ రచయిత చంద్రబోస్ భార్య సుచిత్రకు తండ్రి. చాంద్ బాషా దక్షిణాదిలో పలు సినిమాలకు సంగీతం అందించాడు. తెలుగులో ‘ఖడ్గ తిక్కన్న’, ‘బంగారు సంకెళ్లు’, ‘స్నేహమేరా జీవితం’, ‘మానవుడే దేవుడు’ వంటి సినిమాలకు సంగీతం అందించాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
చాంద్‌బాషా తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాలకు కూడా సంగీతం అందించాడు. చాంద్ బాషాకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. వీళ్లలో కొరియోగ్రాఫర్ సుచిత్ర ఒకరు. ఈమె ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాకు దర్శకత్వం కూడా వహించింది. కాగా చాంద్ బాషా అంత్యక్రియలు జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో నేడు జరుగనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

