Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై లభించిన కీలక ఆధారాలు
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) కేసు దర్యాప్తులో తమకు కీలకమైన ఆధారాలు లభించినట్లు (Verifying Vital Clues) ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు.
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు (Delhi Cops) విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో తమకు కీలకమైన ఆధారాలు లభించినట్లు (Verifying Vital Clues) ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా వాటిని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ తెలిపారు. ఏయే అడ్రెస్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్ని త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Snake | గదిలోకి పామును వదిలి.. భార్య, రెండేళ్ల కుమార్తెను చంపిన వ్యక్తి
Deepfakes: డీప్‌ఫేక్ అంశంపై ఆఫీసర్‌ను నియమిస్తున్నాం: కేంద్ర మంత్రి
Elon Musk | 7 ఏళ్ల తర్వాత తండ్రిని కలుసుకున్న ఎలాన్ మస్క్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

