సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ ప్రోమోను ఇటీవల దర్శకుడు వెంకీ కుడుముల విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కించాం. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని హీరో సూర్య శ్రీనివాస్ చెప్పారు. స్వాతి కశ్యప్, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్ ఏ, సంగీతం: కేశవ కిరణ్, రచన-దర్శకత్వం: భాస్కర్ జక్కుల.