Venkatesh’s New Movie is Produced by Hero Nithiin | టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. చాలారోజులుగా హిట్ లేకుండా ఉన్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం తమ్ముడు చిత్రంతో పాటు రాబిన్ హూడ్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఒకవైపు నటిస్తునే మరోవైపు ఒక సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తుంది. నితిన్ సోంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించనున్నట్లు సమాచారం.
తమిళ దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో స్వయంగా తానే ఈ సినిమాను నిర్మిస్తానని నితిన్ దర్శకుడికి మాటిచ్చినట్లు తెలుస్తుంది. నిజ జీవితంలోని ఘటనల ఆధారంగా ఈ సినిమా రానుండగా.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో వెంకీ మామ పోలీస్ పాత్రలో నటించనున్నాడని అలాగే కీర్తి సురేష్ కథానాయికగా నటించనున్నట్లు టాక్. తమిళ నటుడు దేవర ఫేం నరైన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.