SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం సైంధవ్ (SAINDHAV). వెంకటేశ్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ.. అందరిలో జోష్ నింపుతున్నాడు వెంకీ.
తాజాగా వెంకీ అండ్ టీం చిల్ అవుట్ మూడ్‌లో ఉన్న లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంతో బీటౌన్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు.
సైంధవ్ పాత్రలను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. సైంధవ్.. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
సైంధవ్ ఫస్ట్ సింగిల్ లుక్ వైరల్..
75 days to go for #SAINDHAV💥
First single coming soon.#SAINDHAV#SaindhavOnJAN13th @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop @saregamasouth #Venky75 pic.twitter.com/5wyzz0nNa0
— Venkatesh Daggubati (@VenkyMama) October 30, 2023
సైంధవ్ సస్పెన్స్ అప్డేట్..
#SAINDHAV Marching with a MASSIVE UPDATE Tomorrow at 11:07 AM 🔥
Stay Tuned 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/C2pGchiKzs
— Niharika Entertainment (@NiharikaEnt) October 4, 2023
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్..
Team #SAINDHAV wishes their MANOGNYA aka @ShraddhaSrinath a very Happy Birthday❤️
Her presence & performance both will have you hooked to the screens 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/NgPRp2n2km
— Niharika Entertainment (@NiharikaEnt) September 29, 2023
నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..
Team #SAINDHAV wishes the National Award-Winning Actor @Nawazuddin_S a very Happy Birthday💥
&
Introducing him as the fearsome ‘Vikas Malik’❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP… pic.twitter.com/HaFW8sbOKK
— Niharika Entertainment (@NiharikaEnt) May 19, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..