SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. వెంకీ టైటిల్ రోల్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ సైంధవ్ (SAINDHAV). వెంకటేశ్ 75వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రుహానీ శర్మ (Ruhani sharma), ఆండ్రియా జెర్మియా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నేడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సైంధవ్ టీం కొత్త వీడియో విడుదల చేసింది. సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ లాంఛ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సైంధవ్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన శ్రద్దా శ్రీనాథ్, రుహానీ శర్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో కనిపించనున్నాడు. సైంధవ్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న సైంధవ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..