MAA Elections : మా ఎన్నికలపై వెంకటేశ్ మనసులో మాట ఇదే
తాజాగా వెంకటేశ్ నటించిన నారప్ప సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో మా ఎన్నికలపై తన మనసులో మాట బయట పెట్టాడు.

MAA Elections :సినిమా ఇండస్ట్రీలో వివాదం లేకుండా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేశ్ మాత్రమే. తన పని తాను చూసుకోవడం తప్ప.. ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం అసలు తెలియని హీరో ఈయన. ఇక రాజకీయాలు అంటే కిలోమీటర్ దూరం ఉంటాడు వెంకటేశ్. అది సినిమా రాజకీయాలు అయినా కూడా అస్సలు పట్టించుకోడు. తన పని తాను చూసుకుంటాడు. ఇండస్ట్రీలో మా ఎలక్షన్స్ పై ఇంత జరుగుతున్నా కూడా ఒక్క రోజు కూడా ఆయన స్పందించలేదు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలపై తన మనసులో మాట బయట పెట్టాడు.
తాజాగా వెంకటేశ్ నటించిన నారప్ప సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు వెంకటేశ్. ఇందులో అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఈయన తన సినిమా థియేటర్లో చూడాలని ఎంతో ఆశ పడిన ప్రేక్షకులకు నిరాశ మిగిల్చినందుకు మన్నించమని కోరాడు. ఇది ఖచ్చితంగా తన కెరీర్లో డిఫరెంట్ సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పాడు వెంకటేశ్. ఇదిలా ఉంటే తాజాగా ఇదే ప్రెస్ మీట్ లో మా ఎలక్షన్స్ పై స్పందించాడు వెంకీ. ఏదీ మన చేతుల్లో ఉండదని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చని వెంకటేష్ తెలిపాడు. వీళ్లే గెలవాలి అని తనకు లేదని.. మంచి చేసే వాళ్లు ఎవరు గెలిచినా కూడా బాగానే ఉంటుంది అని చెప్పాడు వెంకటేశ్. అందరికీ మంచే జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని వెంకటేశ్ చెప్పాడు. ఎన్నికల నేపథ్యంలో మాటల తూటాలు, విమర్శలు శాశ్వతం కాదని వెంకటేశ్ తెలిపారు. అలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు అంటున్నాడు. ఈయన ఎవరికీ సపోర్ట్ కూడా చేయడం లేదు. ప్రస్తుతం దృశ్యం 2, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్‌పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
సీక్రెట్ ఏజెంట్స్‌గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రేపటి నుంచే తెలంగాణలో సినిమా థియేటర్లు ఓపెన్
తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?
కరోనా ఎఫెక్ట్.. వచ్చే సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలో!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

