వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న విడుదలకానుంది. ఈ సినిమా ైక్లెమాక్స్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా ఆదివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘16రోజుల్లో ైక్లెమాక్స్‌ను పూర్తి చేశాం. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించాం.
వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వ్యయంతో రూపొందించిన ైక్లెమాక్స్ ఇది. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. అసాంఘిక శక్తులపై ఆయన చేసిన పోరాటం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది’ అన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.