Rana Naidu 2 | టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh) ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హౌజ్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవడం.. అనిల్ కామెడీ వర్కవుట్ అవ్వడంతో తాజాగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలోని బుల్లిరాజు పాత్రకు సినిమా నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. చాలామంది ఆ పాత్రను ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సినిమాలో బుల్లి రాజు వాడే భాష గురించి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది అంటూ తెలిపాడు.
అయితే వెంకటేష్ తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు (Rana Naidu) అనే వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ బోల్డ్‌గా ఉండడంతో పాటు ఇందులో వాడిన భాషవలన విపరీతమైన విమర్శలను ఎదుర్కొంది. అయితే ఈ సిరీస్‌పై ఒక రిపోర్టర్ స్పందిస్తూ.. రానా నాయుడు వలన పిల్లలను పాడు చేశారు కదా అని అడుగుతాడు.
దీనికి వెంకటేశ్ స్పందిస్తూ.. నేను అయితే పిల్లలను పాడు చేయలేదు. నాకు అయితే అలా అనిపించలేదు. ఆ సిరీస్ నేను జెన్యూన్‌గా చేశాను. సీజన్ 1లో ఎక్కువ బోల్డ్ ఉంది అనడంతో సెకండ్ సీజన్లో తగ్గించాను. రానా నాయుడు 2లో అవేం కనిపించవు అంటూ వెంకటేశ్ చెప్పుకోచ్చాడు.