తెలుగు ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతోంది ఎఫ్ 3 టీం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్ 2 ప్రాంఛైజీలో వస్తున్న చిత్రం ఎఫ్ 3 (F3). టాలీవుడ్ (Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej), తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ (mehreen pirzada) హీరోహీరోయిన్లు గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి ఫన్నీ వీడియోను టీం విడుదల చేసింది. ఇంతకీ స్పెషల్ ఏంటంటే..ఇవాళ వెంకీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో వెంకీ పాత్ర ఎంత ఫన్ గా ఉండబోతుందో శాంపిల్ చూపిస్తూ స్పెషల్ బర్త్‌డే విషెస్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.
ఛార్మినార్ లొకేషన్ ముందు లేత ఎరుపు రంగులో కాస్ట్యూమ్స్ వేసుకున్న వెంకీ నవాబు గెటప్‌లో కనిపిస్తూ..చేతిలో నోట్లను విసరకర్రలా వాడుకుంటున్నాడు. చాలా రోజుల తర్వాత వెంకటేశ్‌లోని ఫన్ యాంగిల్‌ను మరోసారి తెరపైకి చూపించబోతున్నాడని తాజా వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, సునీల్, అన్నపూర్ణమ్మ, రఘుబాబు, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఎఫ్ 3 చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ