Sankranthiki vasthunnam | ‘జయాపజయాల గురించి నేను అంతగా పట్టించుకోను. కెరీర్లో ఎన్నో విజయాలు చూశాను. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో కూడా నేను నిత్య విద్యార్థినే అనుకుంటున్నా. ప్రతీ సినిమాకు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నా. సినిమా ఫలితం గురించి ఆలోచించకుండా నాకు అప్పజెప్పిన పనిని వందశాతం అంకితభావంతో నిజాయితీగా పూర్తి చేయాలన్నదే నా సిద్ధాంతం’ అన్నారు అగ్ర నటుడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకటేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..