The Ghost Movie | ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే.. ఫుల్సాంగ్ ఇంకా ఎలా ఉంటుందో..!
The Ghost Movie First Single Promo | గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నాగార్జునకు ‘బంగార్రాజు’తో మంచి విజయం వచ్చింది. కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
The Ghost Movie First Single Promo | గత కొన్నేళ్ళుగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న నాగార్జునకు ‘బంగార్రాజు’తో మంచి విజయం వచ్చింది. కొడుకు నాగచైతన్యతో కలిసి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఈ ఏడాది మొదటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కమర్షియల్‌గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున ఇదే జోష్‌తో ‘ది ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘వేగమ్’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
‘వదలక వదిలే ప్రాయం’ అంటూ సాగే మెలోడీయస్ ప్రోమో ఆకట్టుకుంటుంది. భరత్-సురభ్ స్వర పరిచిన ఈ పాటను కృష్ణ మదినేని రచించగా.. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. ఈ పాటు ఫుల్ సాంగ్‌ను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మలేషియాలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పుష్ప చిత్రాన్ని బాలీవుడ్లో విడుదల చేసిన డిస్ట్రీబ్యూటర్ మనిష్తో మేకర్స్ డీల్ గురించి చర్చించుకుంటున్నారట.
Read Also:
Chiru156 Movie | చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందా?
Naga Shourya | వర్షంలో తడుస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న నాగశౌర్య.. వీడియో వైరల్
Rama Rao On Duty | ఓటీటీలోకి వచ్చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

