The Ghost Movie | నాగార్జునకు కలిసోచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సక్సెస్.. హిందీలోనూ ‘ది ఘోస్ట్’ మూవీ రిలీజ్
The Ghost Movie Release on Hindi | ఈ మధ్య హీరోలందరూ వాళ్ళ మార్కెట్లను దేశమంతటా విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషకే పరిమితమైన సినిమా ఇప్పుడు అన్ని భాషల్లో విడుదలవుతూ మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి.
The Ghost Movie Release on Hindi | ఈ మధ్య హీరోలందరూ వాళ్ళ మార్కెట్లను దేశమంతటా విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషకే పరిమితమైన సినిమా ఇప్పుడు అన్ని భాషల్లో విడుదలవుతూ మంచి విజయాలను నమోదు చేస్తున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరు తమ భాష సినిమాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్రాలు ‘బాహుబలి’ దగ్గర నుండి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన ‘కార్తికేయ-2’ వరకు జాతీయ స్థాయిలో విడుదలై సంచలన విజయాల సాధించాయి. ఇక ఇప్పుడు హీరోలు కూడా ఓకే జానర్‌కు అతుక్కుపోకుండా విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో మరో సీనియర్ స్టార్ హీరో కూడా తన సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ముస్తాబయ్యాడు.
ఆ సీనియర్ స్టార్ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. ఆరు పదుల వయసు వచ్చిన యువ హీరోలకు ధీటుగా యాక్షన్ కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ది ఘోస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ది ఘోస్ట్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా బ్రహ్మస్త్ర చిత్రంతో నాగార్జునకు హిందీలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక బాలీవుడ్లో ‘పుష్ప’ చిత్రాన్ని రిలీజ్ చేసిన ముంబై డిస్ట్రీబ్యూటర్ మనీష్‌తో నాగార్జున చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

