Naga Shourya | వర్షంలో తడుస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న నాగశౌర్య.. వీడియో వైరల్
Krishna Vrinda Vihari Promotions | నాగశైర్య ప్రస్తుతం ఒక హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2018లో వచ్చిన 'ఛలో' తర్వాత ఇప్పటివరకు ఈయన కెరీర్లో ఆ స్థాయి హిట్టు లేదు. ప్రస్తుతం నాగశౌర్య ఒక సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.
Krishna Vrinda Vihari Promotions | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు నాగశౌర్య. కెరీర్ ఆరంభం నుండి కథల ఎంపికలో వేరియేషన్ చూపిస్తూ టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత ‘కృష్ణ వ్రింద విహారి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రం పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా ప్రమోషన్స్‌ను కూడా స్టార్ట్ చేశారు.
ప్రమోషన్స్‌ను వినూత్నంగా సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాద యాత్రతో చేస్తున్నారు. కరోనా వల్ల సినిమాలకు’ ప్రేక్షకులకు కాస్త దూరంగా పెరింగింది. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకే పాదయాత్రతో ప్రమోషన్స్ చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా నాగశౌర్య వర్షంలో తడుస్తూనే పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటీజన్లు సింప్లీసిటీ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని నాగశౌర్య హోం బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. నాగశౌర్యకు జోడీగా షిర్లే సేథియా హీరోయిన్గా నటించింది. స్వర మాంత్రికుడు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి.
Hero @IamNagashaurya begins the 'Paadha Yatra' amidst the rain in Tirupathi & the crowd going crazy! 👌🏻💥#KrishnaVrindaVihari 🎋#KVV #KVVfromSept23rd@ShirleySetia #AnishKrishna #SaiSriram @mahathi_sagar @ira_creations @saregamasouth pic.twitter.com/mEahLoJtTa
— BA Raju's Team (@baraju_SuperHit) September 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

