Rama Rao On Duty On OTT | ‘క్రాక్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన మాస్రాజ అదే జోష్‌తో వరుసగా సినిమాలను చేస్తున్నాడు. కానీ అవి కాస్త ఫ్లాప్‌లుగా మిగిలి రవితేజ కెరీర్ గ్రాఫ్‌ను తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్నరవితేజ.. ఐదు నెలల్లోపే ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ జూలై 29న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. రిలీజ్ అయిన వారంలోపే థియేటర్లలో నుండి వెళ్ళిపోయింది. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. కాగా ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం గత రాత్రి నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. శరత మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటించాడు. దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలను చేస్తున్నాడు.