Chiru156 Movie | చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందా?
Chiru156 Shelved | మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్‌లో సినిమాలను చేస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా సినిమాలను మాత్రం సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే ఆచార్యతో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన మెగాస్టార్ తన తదుపరి చిత్రాలతో అభిమానులు కాలర్ ఎగిరెసుకునే హిట్టు ఇవ్వాలని కసితో ఉన్నాడు.
Chiru156 Shelved | మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్‌లో సినిమాలను చేస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా సినిమాలను మాత్రం సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే ఆచార్యతో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన మెగాస్టార్ తన తదుపరి చిత్రాలతో అభిమానులు కాలర్ ఎగిరెసుకునే హిట్టు ఇవ్వాలని కసితో ఉన్నాడు. ప్రస్తుత చిరు చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అందులో యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ నిర్మాత డీ.వి.వి దానయ్య రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కాన్సిల్ అయిందని తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం చిరు, వెంకీ కుడుము ప్రాజెక్ట్ అయినట్లు టాక్. అయితే చిరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై అంతగా ఆసక్తి చూపడం లేదట. మెగాస్టార్ ముందుగా సెకండ్ హాఫ్‌ను మార్చమని డైరెక్టర్‌కు చెప్పాడట. వెంకీ కుడుముల కూడా దాన్ని మార్చాడట. అయితే మార్చిన సెకండ్ హాఫ్ కూడా చిరుకి అంతగా నచ్చలేదని టాక్. ఆచార్య ఫేయిల్యూర్‌తో చిరు చాలా విషయాల్లో పలుమార్లు ఆలోచిస్తున్నాడట. అయితే దీనిపై కొందరు సినిమాను క్యాన్సిల్ చేయలేదని.. హోల్డ్‌లో పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కోసం వెంకీ కుడుమలు దాదాపు రెండు సంవత్సరాలుగా వేయిట్ చేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం వెంకీ కుడుముల ఓ యంగ్ హీరోతో తన జానర్ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడట. వెంకీ కుడుముల గతంలో ‘ఛలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ చిత్రాలు కమర్షియల్‌గా హిట్టవడమే కాకుండా, ఆయా హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లగా నిలిచాయి.
Read Also:
Rama Rao On Duty | ఓటీటీలోకి వచ్చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Mega154 movie | సంక్రాంతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ
Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

