Mega154 movie | సంక్రాంతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ
Walteir Veerayya | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం షూటింగ్ జరుపకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనుంది.
Walteir Veerayya | ఫలితం ఎలా ఉన్నా చిరంజీవి మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘ఆచార్య’తో చిరు భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రం సంక్రాంతి రేసులో జాయిన్ అయినట్లు తెలుస్తుంది. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ ‘ఆదిపురుష్’ అధికారికంగా ప్రకటన రాగా, విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతికి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ఈ రెండు సినిమా పోటీలను తట్టుకుని బాస్ గెలుస్తాడా? లేదా? అని చూడాలి. అసలు ఈ వార్తలో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ చిత్రంలో మెగాస్టార్ అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరి వెంకటేష్ గెస్ట్ రోల్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
Read Also:
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
Dhanush | ‘నానే వరువెన్’ తెలుగు పోస్టర్ రిలీజ్.. క్లాస్‌లుక్‌లో అదరగొడుతున్న ధనుష్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

