ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
Theater/OTT Releases This Week | ప్రేక్షకులు ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకే పట్టం కడుతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అటువైపు కూడా చూడట్లేదు.
Theater/OTT Releases This Week | ప్రేక్షకులు ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలకే పట్టం కడుతున్నారు. ఎంత పెద్ద హీరో అయినా, భారీ బడ్జెట్ సినిమా అయినా సరే కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అటువైపు కూడా చూడట్లేదు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమాల హవా బాగా నడుస్తుంది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలయితే థియేటర్లలో జోరు చూపిస్తున్నారు. ఆగస్టు నెల టాలీవుడ్‌కు ధైర్యం ఇవ్వగా.. సెప్టెంబర్ నెల దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. గతవారం నాలుగైదు చిత్రాలు విడుదలవగా అందులో శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మంచి విజయం సాధించగా, హిందీ అనువాద చిత్రం ‘బ్రహ్మస్త్ర’ కూడా బాక్సాఫీస్ దగ్గర రాణిస్తుంది. ఇక ఈ వారం కూడా మీడియం రేంజ్ సినిమాలతో సందడి చేయనుంది. ఈ వారం థియేటర్/ఓటీటీలలో విడుదయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్దాం
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి:

సుధీర్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈచిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. సుధీర్ బాబుకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటించింది.
నేను మీకు బాగా కావాల్సినవాడిని:

ఇప్పటివరకు సాఫ్ట్ కథలతో మెప్పించిన కిరణ్అబ్బవరం ఈ సారి మాస్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే మణిశర్మ బాణీలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
ది లైఫ్ ఆఫ్ ముత్తు:

తమిళ స్టార్ శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ది లైఫ్ ఆఫ్ ముత్తు పేరుతో స్రవంతి రవి కిషోర్ విడుదల చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌తో తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది.
శాకినీ డాకినీ:

లేడీ మల్టీస్టారర్ శాకినీ డాకినీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. నివేధా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మిడ్నైట్ రన్నర్ కి రీమేక్‌గా తెరకెక్కింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి.
K-3 కోటీకొక్కడు:

విక్రాంత్ రోణతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు కిచ్చా సదీప్. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో గతేడాది కన్నడలో విడుదలై సంచలన విజయం సాధించిన కోటిగబ్బాను తెలుగులో విడుదల చేస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. శివ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది.
వీటీతో పాటు బిగ్ బాస్ ఫేం వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్లుగా నటించిన ‘సకల గుణాభిరామా‘, సుధాకర్ జంగం, లావణ్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘అం అః’ చిత్రాలు కూడా సెప్టెంబర్ 16న విడుదలవుతున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
డిస్నీ +హాట్‌స్టార్:
విక్రాంత్ రోణ- సెప్టెంబర్ 16
దహన(హిందీ)- సెప్టెంబర్ 16
సోనిలీవ్:
రామారావు ఆన్ డ్యాటీ సెప్టెంబర్ 15
కాలేజ్ రొమాన్స్ సిరీస్-3(హిందీ) సెప్టెంబర్ 15
నెట్‌ఫ్లిక్స్:
జోగి(హిందీ)-సెప్టెంబర్ 16
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

