Adipurush Movie Teaser | ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆదిపురుష్’ అప్డేట్లు త్వరలోనే రానున్నాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉంది. అయితే షూటింగ్ గడిచి నెలలు దాటుతున్నా సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఒక్కటి కూడా రాకపోవడంతో ప్రభాష్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకునే వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
ఆదిపురుష్ టీజర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. రామ నగరం అయోధ్యలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే చిత్రబృందం టీజర్‌ను కట్ చేసే పనిలో ఉన్నారట. అంతేకాకుండా అక్టోబర్ నుండి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారట. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ హక్కులను యూవీ క్రియేషన్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Read Also:
“Adipurush | తెలుగు రాష్ట్రాల్లో భారీగా ‘ఆదిపురుష్’ థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?”
“Adipurush Movie | ఆ అగ్ర నిర్మాణ సంస్థకు ‘ఆదిపురుష్’ థియేట్రికల్ హక్కులు.. !”
Cobra Movie | ఓటీటీలోకి ‘కోబ్రా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?