Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Dasara Movie Theatrical Rights | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. సినిమా సినిమాకు వేరియషన్ చూపిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
Dasara Movie Theatrical Rights | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. సినిమా సినిమాకు వేరియషన్ చూపిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘అంటే సుందరానికీ’ చిత్రంతో మరో విజయం సాధించాడు. అయితే నాని సినిమాలకు టాక్ బాగానే వస్తున్నా కమర్షియల్ హీరోగా మాత్రం గర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే నాని దసరా చిత్రంతో గతంలో ఎన్నడు చేయలేని మాస్ అవుట్ అండ్ అవుట్ రా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకోవాలిన గట్ట ప్రయత్నాలే చేస్తున్నాడు.
శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ చిత్రం కోసం నాని తన రెమ్యునరేషన్‌ను కూడా తగ్గించుకున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రూ.27 కోట్లకు దసరా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయట. నాని కెరీర్లోనే ఇదే అత్యధికం. ఈ చిత్రాన్ని చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తున్నారు. నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలో ఈ చిత్రానికి సుమారు రూ.45 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తుంది.
కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్ స్వరాలను సమకూరుస్తున్నాడు.
Read Also:
Mega154 movie | సంక్రాతి రేసులో మెగాస్టార్.. ప్రభాస్, విజయ్‌లతో పోటీ
Adipurush Movie | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

