Simbu | ‘ఒంటరిగా నడిచేటప్పుడు ప్రతి అడుగూ నిప్పుతో చెలగాటమే’.. శింబు ‘ముత్తు’ ట్రైలర్ అప్డేట్..!
The Life of Muthu Trailer Update | తమిళంతో పాటు తెలుగులో సమానంగా క్రేజ్ దక్కించుకున్న నటుడు శింబు. అప్పట్లో యూత్‌లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది, మన్మధ, వల్లభ వంటి సినిమాలు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధించాయి.
The Life of Muthu Trailer Update | తమిళంతో పాటు తెలుగులో సమానంగా క్రేజ్ దక్కించుకున్న నటుడు శింబు. అప్పట్లో యూత్‌లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలకు టాలీవుడ్ టైర్2 హీరోల సినిమా రేంజ్లో కలెక్షన్లు సాధించాయి. అయితే ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు తెలుగులో తక్కువగా విడుదలయ్యేవి. ఆ విడుదలైనవి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయేవి. ప్రస్తుతం ఈయన తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈయన నటించిన వెంధు తానింధాతు కాదు చిత్రాన్ని తెలుగులో ముత్తు పేరుతో విడుదల చేస్తున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ఇక్కడ కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను అనౌన్స్ చేశారు.
‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం 5.04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘ఒంటరిగా నడిచేటప్పుడు ప్రతి అడుగూ నిప్పుతో చెలగాటమే’ అంటూ మేకర్స్ ట్రైలర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో శింబు మూడు విభిన్న ఏజ్ గ్రూప్‌లో ఉండనుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి గణేష్ నిర్మించాడు. శింబుకు జోడీగా సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించింది.
ఒంటరిగా నడిచేటప్పుడు ప్రతి అడుగూ నిప్పుతో చెలగాటమే 🔥@SilambarasanTR_'s intense #TheLifeOfMuthu Trailer today at 5:04 PM💥#TLOMTrailer @menongautham @arrahman @SiddhiIdnani @IshariKGanesh @VelsFilmIntl #TheLifeOfMuthuOnSep17th pic.twitter.com/sPKVays0GV
— Sri Sravanthi Movies (@SravanthiMovies) September 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

