Veera Simha Reddy Movie | ప్రస్తుతం బాలయ్య అభిమానులున్నంత ఖుషీలో ఏ హీరో అభిమాని లేడు. ‘అఖండ’తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. అదే ఊపులో సంక్రాంతికి ‘వీరసింహా రెడ్డి’తో వచ్చి సంచలన విజయం సాధించాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు భారీ విజయాలు సాధించడంతో నందమూరి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహా రెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం వేట కొనసాగించింది. తొలిరోజే రూ.50 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
అయితే ‘వాల్తేరు వీరయ్య’ రాకతో కలెక్షన్లలో తీవ్రంగా మార్పులు వచ్చాయి. రెండో రోజు కేవలం రూ.8 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక రోజు రోజుకు కలెక్షన్లు తగ్గుతూనే వచ్చాయి. ఒకనొక దశలో అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడుంది బాలయ్య. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల వేట మాత్రం కొనసాగించాడు. ఐదవ రోజు నుండి మళ్ళీ కలెక్షన్లు పుంజుకున్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. ఐతే ఈ వారం పఠాన్‌తో పాటు హంట్ మూవీ రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో వీరసింహకు థియేటర్ల కొత తప్పదు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్, హనీ రోజ్లు నటించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలకపాత్ర పోషించింది. కన్నడ నటుడు దునియావిజయ్ ప్రతినాయకుడిగా నటించాడు. బాలయ్య ద్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాను మైత్రీ సంస్త నిర్మించింది.