రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పి.పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నిర్మాతలు. నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర దర్శకుడు మనోజ్ పల్లేటి, సంగీత దర్శకుడు సమర్ధ్ గొల్లపూడి విలేకరులతో ముచ్చటించారు. ‘స్క్రిప్ట్ రెడీ అయ్యాక కొంతమంది నిర్మాతలను కలిశాను. వారికి స్క్రిప్ట్ నచ్చింది. కొత్త దర్శకుడు ఎలా తీస్తాడో అని డౌట్ పడ్డారు.
విన్నవారంతా కథను మెచ్చుకోవడం నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. పద్మనాభరెడ్డి, అశోక్‌రెడ్డి నాతో కలిశారు. ముగ్గురం కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఇది థ్రిల్లింగ్ సందర్భాల్లో కూడా నవ్వించే కామెడీ థ్రిల్లర్. సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చింది? అనేది ఈ మూవీ కాన్సెప్ట్’ అని దర్శకుడు చెప్పారు. అన్ని ఎమోషన్సూ ఉన్న ఇలాంటి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉందని, టీమ్ అంతా కష్టపడి చేసిన సినిమా ఇదని సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి అన్నారు.