ఏమాయ చేశావే సినిమాతో కుర్ర కారు మనసుల్లో చెరగని ముద్రవేసుకుంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఫ్యాన్స్, ఫాలోవర్లు, శ్రేయోభిలాషులు, స్నేహితులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే సామ్‌కు ఓ వ్యక్తి నుంచి స్పెషల్ విషెస్ అందాయి. ఇంతకీ అతడెవరో ఊహించే ఉంటారు. సామ్ కోస్టార్ విజయ్ దేవరకొండ (vijay devarakonda) తన టీంతో కలిసి స్పెషల్ విషెస్ అందించాడు.
శివనిర్వాణ (Shiva Nirvana) డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం ప్రస్తుతం కశ్మీర్ లొకేషన్ (Kashmir location)లో ఉంది సామ్, విజయ్ టీం. అయితే గురువారం పుట్టినరోజు (Samantha Birthday) జరుపుకోబోతున్న సమంత కోసం శివనిర్వాణతో ఫేక్ సన్నివేశం రాయించాడు విజయ్. వేకువ జామునే 12 గంటలకు సామ్‌కు విషెస్ తెలిపేందుకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు టీం మెంబర్స్ అంతా.
కెమెరా..లైట్స్ ఆన్..యాక్షన్ అనగానే సామ్ విజయ్ దగ్గరకెళ్లి పక్కనే కూర్చొని..ఏమైంది ఎందుకిలా ఉన్నావ్..నేను వెళ్లిపోతున్నాననా..? 10 రోజుల్లో వచ్చేస్తాను. నువ్వు మన గురించి మా పేరెంట్స్ తో మాట్లాడటం కాదు..నేను మా పేరెంట్స్ తో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తాను..ఇటు చూడు..అంటుండగానే బాధలో ఉన్న విజయ్ సమంత హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేస్తాడు..ఏం జరుగుతుంది అని సామ్ అనడం వీడియోలో చూడొచ్చు. ఇదంతా సినిమా సీన్ అనుకునేలా షూట్ చేసి సామ్‌కు సర్ ప్రైజ్ విషెస్ అందించారు శివనిర్వాణ టీం .