VD12 Movie | విజయ్ దేవరకొండ లైనప్‌లో దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టేసిన ఈ సినిమా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో తెగ బిజీగా గడుపుతుంది. గీతా గోవిందం ఫేమ్ పరుశురాం పెట్ల ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు సంక్రాంతికే దింపుతున్నట్లు ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై సినీ లవర్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. పైగా గీతాగోవిందం కాంబో అయ్యే సరికి జనాల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే సంక్రాంతికి రసవత్తర పోటీ ఉంది. గుంటూరు కారం సహా కొన్ని సినిమాలు ఆర్నెళ్ల ముందే సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఇది కూడా చేరడంతో ఈ సారి సంక్రాంతి మరింత హీటెక్కేలా కనిపిస్తుంది. మొదటగా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకున్న ప్రాజెక్ట్-కే ఎలాగూ రాకపోవడంతో స్టార్ హీరోల సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా సంక్రాంతినే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సంక్రాంతి రేసులో ఉండగా.. హనుమాన్, ఈగల్తో పాటు నా సామిరంగ కూడా అదే స్లాట్‌ను బుక్ చేసుకున్నాయి.
వీటితో పాటు శివకార్తికేయన్ ఆయాలన్ కూడా సంక్రాంతికే రానుంది. ఇలా గంపగుత్తగా సినిమాలు రిలీజైతే మట్టుకు థియేటర్లు పంచడం కష్టమే. ఇక సంక్రాంతి వచ్చే సరికి ఇంకెన్ని సినిమాలు యాడ్ అవుతాయో.. ఉన్న దాంట్లో ఎన్ని పోస్ట్ పోన్ అవతాయో చూడాలి.