టాలీవుడ్ డైరెక్టర్ శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (vijay devarakonda) చేస్తున్న చిత్రం VD11 (వర్కింగ్ టైటిల్). చెన్నై భామ సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం విజయ్ అండ్ టీం ప్రస్తుతం కశ్మీర్ లొకేషన్ (Kashmir location)లో షికారు చేస్తోంది. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా విజయ్‌తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.
విజయ్ దేవరకొండకు విషెస్ తెలియజేస్తూ 16 రోజుల షూటింగ్‌కు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా ఫస్ట్ లుక్ డేట్‌ను ప్రకటించాడు శివనిర్వాణ. మే 16న టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ రాబోతుందంటూ వీడియోలో చెప్పారు. ఈ చిత్రంలో జయరాం, సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అవుట్ అండ్ అవుట్ లవ్ ట్రాక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు విజయ్-సామ్.