VD 14 Title Announcement | రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘VD14’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించి అధికారిక టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. గతంలో విజయ్, రాహుల్ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రం 19వ శతాబ్దపు నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, బ్రిటిష్ కాలం నాటి తెలియని చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘రణభేరి’ లేదా ‘ది గన్’ అనే పవర్ఫుల్ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా, దర్శకుడు రాహుల్ ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీరేలా ఈ సినిమా ఉంటుంది” అని హామీ ఇవ్వడం విశేషం. ఇందులో విజయ్ సరసన రశ్మిక మందన్న నటిస్తుండగా, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈ రిపబ్లిక్ డే అప్డేట్తో విజయ్ దేవరకొండ మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
— Vijay Deverakonda (@TheDeverakonda) January 24, 2026