Korean Kanakaraju | ఇదివరకు హారర్ కామెడీ సినిమాలంటే దాదాపు చిన్నసినిమాలే ఉండేవి. ఇప్పుడు స్టార్లు కూడా హారర్ కామెడీ చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమా కూడా హారర్ కామెడీనే. ఈ నేపథ్యంలో త్వరలో మెగా హీరో వరుణ్‌తేజ్ కూడా ఓ కామెడీ హారర్ మూవీ చేయబోతున్నారు.
మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. ‘కొరియన్ కనకరాజు’ టైటిల్‌ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. రాయలసీమ నేపథ్య కథాంశం కావడం చేత ప్రస్తుతం రాయలసీమ యాసని ప్రాక్టీస్ చేసే పనిలో వరుణ్‌తేజ్ బిజీగాఉన్నారట. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.