Varun Tej Next Film With Sujeeth | కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తన నటనను కొత్తగా తెరమీద ఆవిష్కరిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు వరుణ్ తేజ్. ఫలితం ఎలా ఉన్న వరుణ్ మొదటి నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే వరుణ్ నటించిన ‘ఎఫ్-3’ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన గురుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారుతో సినిమాచేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమాలో వరుణ్ బాడీగార్డ్‌గా కనిపించనున్నాడట. ఇదిలా ఉంటే వరుణ్ మరో దర్శకుడిని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది.
‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి సినిమాలను తెరకెక్కించిన సుజీత్‌తో వరుణ్‌తేజ్ తన 13వ సినిమాను చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. సాహో తర్వాత సుజీత్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. మధ్యలో చిరుతో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది సెట్స్‌పైకి వెళ్ళలేదు. వరుణ్‌తో చేయబోయే సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్నట్లు టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.