Varun Tej | టాలీవుడ్ యాక్టర్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ త్రిపాఠి (Lavanya Tripathi) త్వరలోనే ఒక్కటవ్వబోతున్న విషయం తెలిసిందే. జూన్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరుగనుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెకేషన్లో భాగంగా పారిస్‌లో చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే కొన్ని ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కొన్ని స్పెషల్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వరుణ్ తేజ్ తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదునుపెట్టాడు. ఆప్రాన్ షూట్ వేసుకుని పిజ్జా (Varun Tej), పాస్తా తయారుచేశాడు. వాటిని చూపిస్తూ తనను తాను ఉత్తమ పిజ్జా తయారీదారుడిగా ప్రకటించుకున్నాడు.
వరుణ్ తేజ్ పిజ్జా తయారు చేయడం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం హీరోని ఆటపట్టించడం మొదలుపెట్టారు. ఒక అభిమాని ‘ నీకు వంటలో శిక్షణ ప్రారంభం.. అని కామెంట్ పెట్టగా.. మీరు ఎంగేజ్మెంట్ కోసం రుచికరమైన వంటకాలను తయారు చేస్తున్నారా? అని మరొకరు కామెంట్ పెట్టారు. పెళ్లికూతురు లావణ్య ఎక్కడున్నారు? అంటూ మరో యూజర్ అడిగాడు. వరుణ్ తేజ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరుణ్‌తేజ్ ప్రస్తుతం గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Varuntej1
Varuntej2
Varuntej3