Varun Tej-Lavanya Tripathi | వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన మెగాస్టార్
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తుంది.
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనుల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందని తెలుస్తుంది. నవంబర్ 1న డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. నాలుగే వేల మైళ్ల దూరంలో ఉన్న ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారట. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. శుక్రవారం సాయంత్రం వరుణ్, లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి.. ఇక ఈ ఈవెంట్‌కు చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు, రామ్ చరణ్ & ఉపాసన, నాగబాబు ఫ్యామీలి, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అలాగే మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
About Last evening ..
Pre Wedding Celebrations of @IAmVarunTej & @Itslavanya #MomentsToCherish pic.twitter.com/TwUqaSUmXD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2023
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

