Ghani movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రినైస్సెన్స్ పిక్చర్స్-అల్లుబాబీ కంపెనీ బ్యానర్ల పై అల్లు బాబీ, సిద్దుముద్ద నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా సాయి ముంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.తాజాగా వరుణ్ తేజ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఫోటోను పంచుకున్నాడు.ఇక ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గని చిత్రం నిజానికి డిసెంబర్ 24నే విడుదల కావాల్సింది. కాని పుష్ప, శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రాలు పోటిగా ఉండటంతో విడుదలను దర్శక నిర్మాతలు విరమించుకున్నారు.తాజాగానే వరుణ్ తేజ్ నటించిన ఎఫ్3 షూటింగ్ పూర్తైంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.దీంతో వరుణ్ తేజ్ ఓకే సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్న మాట.