‘నింద నా మనసుకు దగ్గరైన సినిమా. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకెప్పుడూ ఇలా అనిపించలేదు. రాజేష్ ఎంతో పాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. పరిశ్రమలో గొప్ప దర్శకుడిగా ఎదుగుతారాయన. పనిచేసిన అందరూ వంద శాతం ఎఫర్ట్ పెట్టారు. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇది’ అని హీరో వరుణ్‌సందేశ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ అనేది ఉపశీర్షిక.
రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. సినిమా అవుట్‌పుట్ చూశాక చాలా సంతృప్తి కలిగిందనీ, ఇదే తాను సాధించిన విజయమనీ, అందరూ మనసుపెట్టి పనిచేసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శక,నిర్మాత రాజేశ్ జగన్నాథం నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు వరుణ్‌సందేశ్ అర్ధాంగి, నటి వితిక షేరు కూడా మాట్లాడారు.