Bhediya Movie On Ott | ఈ రోజుల్లో థియేటర్లో సినిమా విడుదలైన నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య, దసరా వంటి బ్లాక్ బస్టర్లు సైతం నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేశాయి. ఒక్క తెలుగు అనే కాదు అన్ని భాషల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అయినా సరే నాలుగు వారాలు దాటిందంటే ఓటీటీ బాట పట్టేస్తున్నాయి. అయితే ఒక్క సినిమా కోసం మాత్రం ప్రేక్షకులు ఆర్నెళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని. ఇంతకీ అది ఏ సినిమా అనుకుంటున్నారా? అదే వరుణ్ధావణ్ హీరోగా నటించిన భేదియా మూవీ. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. కాగా ఇన్నాళ్లకు మేకర్స్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో మే 26వ తేది నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. గతేడాది నవంబర్‌లో రిలీజైన ఈ సినిమా జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కింది. ఇక తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశాడు. అయితే తెలుగులో ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేదని సమాచారం. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఇటీవలే సీక్వెల్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ ప్రకటించారు. అనుకోకుండా ఓ మనిషి తోడేలులా మారితే వాళ్ల జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో భేదియా మూవీ తెరకెక్కింది. వరుణ్‌ధావన్‌కు జోడీగా కృతిసనన్ నటించింది.